Saturday, November 23, 2024

ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది !!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ముందు తెరపైకి వచ్చింది. అందరూ కూడా ఆనందయ్య మందు కోసం క్యూ కట్టారు. కానీ సర్కారు మాత్రం ఆ మందు పై పూర్తిస్థాయిలో నివేదిక వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు ఆదేశాలను జారీ చేసింది. కాగా ఈ మూలికలు వైద్యం చేస్తున్న ఆనందయ్య మందుకు తాజాగా ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే మందు అలాగే కే అనే మందును మాత్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ అనే మందులు వాడేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆనంద‌య్య వేస్తున్న కంట్లో మందుల‌పై పూర్తి నివేద‌క‌లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇత‌ర మందులతో ఎలాంటి ఇబ్బంది లేద‌ని స్పష్టం చేసింది.

అయితే, ఈ మందు వ‌ల్ల క‌రోనా వైర‌స్ త‌గ్గుతుంద‌ని… రాకుండా ఉంటుంద‌ని మాత్రం నివేదిక ధృవీక‌రించ‌లేదు. ప్ర‌జ‌లు త‌మ‌కు ఇష్ట‌మైతే తీసుకోవ‌చ్చ‌ని, ఇక ఆనంద‌య్య మందు తీసుకునే స‌మ‌యంలో క‌రోనా ప్రోటోకాల్ పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. కంట్లో వేసే మందుపై నివేదికలు రావడానికి ఇంకో మరో 2–3 వారాల సమయం పట్టే అవ‌కాశం ఉంది. అయితే, ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఆనందయ్య మందును వాడుకోవచ్చని ప్ర‌భుత్వం తెలిపింది. అయితే ఆనంద‌య్య మందును తీసుకోవ‌టానికి క‌రోనా రోగులు రావొద్ద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదే అంశాన్ని ప్ర‌భుత్వం హైకోర్టుకు తెల‌ప‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement