Friday, November 22, 2024

NSE కేసులో ఆనంద్‌ సుబ్రమణియం అరెస్టు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) మాజీ సీఈవో చిత్రా రామ‌కృష్ణ‌, ఆమె స‌ల‌హాదారు, మాజీ గ్రూప్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ ఆనంద్ సుబ్రమ‌ణియం.. సంస్థకు సంబంధించిన నిధులను అక్రమ మార్గాల్లో విదేశాలకు మ‌ళ్లించార‌నే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంస్థకు సంబంధించిన నిధులను అక్రమ మార్గాల్లో విదేశాలకు మ‌ళ్లించార‌నే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆనంద్‌ సుబ్రమణియంను సీబీఐ అధికారులు గురువారం అర్ధ‌రాత్రి తర్వాత చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే చిత్రా రామ‌కృష్ణను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. ఆమె ఎక్కడికీ పారిపోకుండా లుకౌట్‌ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. 2013 నుంచి 2016 మ‌ధ్య కాలంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్రా రామ‌కృష్ణ ప‌నిచేశారు. హిమాల‌యాల్లో నివ‌సించే ఓ యోగితో సూచనలతో ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌తో పాటు పలు కీలక పదవుల్లో క్యాపిటల్‌ మార్కెటింగ్‌పై ఎలాంటి అవగాహన లేని ఆనంద్‌ సుబ్రమణియంను నియమించారని సెబీ దర్యాప్తులో ఇటీవల తేలింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement