మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు తీవ్రతరమవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ గురించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కరోనా విజృంభణపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ టీకాలు ఇచ్చేలా అత్యవసర అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరారు. దేశ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైన రాష్ట్రాన్ని లాక్‌డౌన్లు బలహీనపరిచే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు ఇచ్చేలా రాష్ట్రానికి అత్యవసర అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని…వ్యాక్సిన్ల కొరత కూడా ఉండకూడదని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ను ఆయన ట్యాగ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement