తిరుమల ప్రసాదానికి అనకాపల్లి బెల్లం ఉపయోగించేలా చేస్తాం అని పవన్ కళ్యాన్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ (ఆదివారం) అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనకాపల్లి బెల్లానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ఉందని అన్నారు. గతంలో తిరుమల శ్రీవారి ప్రసాదం కోసం అనకాపల్లి బెల్లం ఉపయోగించారు. వైసీపీ ప్రభుత్వం ఈ బెల్లం వాడటం మానేసిందని.. మేం అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రసాదానికి అనకాపల్లి బెల్లం ఉపయోగించేలా, గ్లోబల్ ట్యాగ్ వచ్చేలా చేస్తాం అని హామీ ఇచ్చారు.
శారదా నదిపై మినీ ప్రాజెక్టులు, కాల్వలకు మరమ్మతులు చేసి ప్రతి పొలానికి నీళ్లు ఇస్తాం అని ఆయన అన్నారు. తమ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ‘‘నేను సాధారణ ఉద్యోగి కుమారుడిని. ఉద్యోగులకు పెన్షన్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే న్యాయం చేస్తాం అని అన్నారు. అనకాపల్లి SEZలో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా కృషి చేస్తాం. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.