రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఆనాడు ఎన్టీఆర్… ఈనాడు కేసీఆర్ ఆలోచిస్తున్నారు అని, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గంగదేవి పల్లె గ్రామాన్ని మించి నేడు ఎన్నో గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడు సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్ర పరిస్థితి… ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని గమనించాలన్నారు. పెన్షన్ పెంపుతో నేడు ఎంతో మందికి ఆర్ధిక చేయూత అందిందన్నారు. కరోనా సమయంలో ఆర్ధిక పరిస్థితి బాగా లేకున్నా పెన్షన్ లు ఆపలేదని, కొత్త పెన్షన్ లను త్వరలోనే ఇస్తామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏ పనులు జరగలేదన్నారు. తెలంగాణ సర్కార్ నేడు ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. కాళేశ్వరం ను పూర్తి చేసి నేడు తాగు, సాగు నీరు కు డోకా లేకుండ మన ముఖ్యమంత్రి చేసారన్నారు. కాళేశ్వరం వల్ల నీరు పడని బోర్ లలో కూడా ఇప్పుడు నీరు పొంగి పొర్లుతున్నాయి. మోటార్ లు కాలి పోకుండా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం.. ప్రాణం ఉన్నాంత వరకు మోటార్ లకు మీటర్లు పెట్టను అని కేసీఆర్ అన్నారన్నారు మన ముఖ్యమంత్రి దయ వల్లనే గ్రామాలలకు పుష్కళంగా నిధులు మంజూరు అవుతున్నాయి.. దాదాపు
600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందన్నారు. 800 కోట్ల రూపాయలు కేంద్రమే ఆపింది కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఆనాడు ఎన్టీఆర్… ఈనాడు కేసీఆర్ ఆలోచిస్తున్నారు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Advertisement
తాజా వార్తలు
Advertisement