ఇరవై మూడు వారాలు పూర్తయిన కారణంగా అబార్షన్‌కు అనుమతి నిరాకరించిన ఢిల్లి హైకోర్టు తీర్పుపై పాతికేళ్ల అవివాహిత యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గర్భస్రావ చట్ట ప్రకారం 20 వారాల తర్వాత అబార్షన్‌కు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో, ఆమె అబార్షన్‌కు అనుమతి కోరుతూ, మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఆమె కేసును అత్యవసర విచారణ జాబితాలో చేర్చాలని యువతి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. 24 వారాలు పూర్తి కావస్తున్నందున ఆమెకు ప్రతి ఒక్క రోజూ చాలా విలువైందని లాయర్ న్యాయస్థానానికి వివరించారు. అడ్వకేట్ అభ్యర్థనను సీజే జస్టిస్ ఎన్వీ రమణ ఆమోదించారు. విచారణను వెంటనే చేపడతామని హామీనిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.