కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ఘోరం జరిగింది. టోల్ బూత్ వద్ద అంబులెన్స్ కు జరిగిన ఘోర ప్రమాదం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనలో రోగి, అతని భార్య, వారి బంధువు, టోల్ అటెండర్ సహా నలుగురు చనిపోయారు. అంబులెన్స్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అంబులెన్స్ స్పీడ్‌గా వస్తుండగా బారికేడ్లను తొలగించేందుకు టోల్ బూత్ సిబ్బంది పరుగులు తీస్తున్న ఫుటేజీ ఈ వీడియోలో చూడవచ్చు.
ఒకతను బారికేడ్లు తొలగిస్తుండగానే.. అంబులెన్స్ వేగంగా వచ్చి అడ్డంగా పడిపోయింది. అంబులెన్స్ వేగంతో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై స్కిడ్ అవుతూ టోల్బూత్ని ఢీకొట్టింది. వాహనం, ఒక సెకను, గాలిలోకి లేవడంతో వెనుక డోర్ ఓపెన్ అయిపోయి అందులో ఉన్నవాళ్లు బయటికి విసిరేసినట్టు పడిపోయారు.
కాగా, అక్కడ రోడ్డు తడిగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. టైర్లు, రహదారి మధ్య నీటి పొర ఏర్పడినప్పుడు ఆక్వాప్లానింగ్ జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు.. దీని ఫలితంగా అంబులెన్స్ లోని పేషెంట్లు, తమ సీట్ల నుండి ఎగిరి టోల్‌లోకి పడిపోయారు. స్పీడ్ ఎక్కువగా ఉండడంతో అంబులెన్స్ సీసీటీవీ కెమెరాకు తగిలి చివరకు నేలపై పడింది.