Wednesday, December 4, 2024

TG | మూసీ ప్రక్షాళనకు అఖిలపక్ష సమావేశం..

దేశంలోని అన్ని నగరాలను కాలుష్యం ఆక్రమించిందని… అయితే, హైదరాబాద్ నగరంలో కాలుష్యానికి తావులేకుండా భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి అభివృద్ధి దిశగా మన ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేర‌కు మూసీ నది ప్రక్షాళన కోసం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మాట్లాడుతూ… దయచేసి నగర అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిని కూడా అడ్డుకుంటామన్నారు.

కాగా, మంత్రివర్గ ఉపసంఘంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఉంటారు. అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల ప్రతిపాదనలు, సూచనలను తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement