Friday, November 22, 2024

స్కాలర్‌షిప్‌ అడ్మిషన్‌ టెస్టు నిర్వహిస్తున్న అన్‌అకాడమి..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : విద్యాబుద్ధులు నేర్చుకోవాలని కోరుకునే వారి వృద్ధి చెందుతున్న ఆకాంక్షలకు మద్ధతు ఇస్తున్న భారతదేశపు అతి పెద్ద లెర్నింగ్‌ ప్లాట్‌ఫారం అన్‌అకాడమి.. తన మొదటి ఆఫ్‌లైన్‌ పరీక్ష నేషనల్‌ స్కాలర్‌షిప్‌ అడ్మిషన్ టెస్ట్‌ (యూఎన్‌ఎస్‌ఏటీ)ని ప్రకటించింది. ఈ పరీక్షను 2022 జూన్‌ 4, 5 తేదీల్లో ఢిల్లీ, కోట, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర భారతదేశంలోని ప్రముఖ 40 కీలక ఎడ్యుకేషనల్‌ హబ్‌లలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. నీట్, యుజి, ఐఐటి, జెఇఇ, ఫౌండేషన్‌ (9-12) కోర్సుల ఆకాంక్షలు అందరూ యుఎన్‌ఎస్‌ఎటి పరీక్షకు హాజరు కావచ్చని తెలిపింది.

అర్హత కలిగిన లెర్నర్లు అందుకునే ఈ స్కాలర్‌షిప్‌లు, పురస్కారాలు రూ.150 కోట్ల విలువ కలిగి ఉన్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2022 జూన్‌ 2లోగా ఈ రిజిస్ట్రేషన్‌ లింక్‌ లో రిజిస్ట్రరు చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement