దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. పండుగ సీజన్ డిమాండ్ను తీర్చేందుకు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించనుంది. డెలివరీ కార్యకలాపాల్లో మెరుగైన సేవలు, నెట్వర్క్ కోసం లక్షా 10వేల కంటే ఎక్కువ సీజనల్ ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించినట్టు అమెజాన్ ఇండియా తెలిపింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణె, బెంగళూరు, కోల్కతా, లక్నో, చెన్నై నగరాల్లో ఉద్యోగాలు ఉండనున్నాయి. ఇప్పటికే నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు అమెజాన్ వెల్లడించింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement