అమృతసర్ – ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ భారత్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఆమె చేసిన ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. బ్రిటన్‌కు వెళ్లేందుకు ఆమె అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.అయితే ఆమె పేరుతో లుక్‌ఔట్ నోటీసు జారీ కావడంతో ఇమిగ్రేషన్ అధికారులు ఆమె ప్రయాణానికి అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలోనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఇదిలా ఉండగా.. మార్చి 18న పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్‌పాల్ సింగ్ నేటికీ పరారీలో ఉన్నాడు. వాహనాలు, వేషాలు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో అతడి అనుచరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అతడి అత్యంత సన్నిహితుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరిని అస్సాంలోని జైలుకు తరలించారు. అమృతపాల్ కో్సం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement