న్యూఢిల్లీ – శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ప్రాంతమైన సీతామర్షి అనుసంధానం చేసేలా ఈ కొత్త వెర్షన్ రైలును తెర మీదకు తీసుకొస్తున్నది ఇండియన్ రైల్వేస్. అమృత్ భారత్ పేరుతో తీసుకొస్తున్న కొత్త రైలులో రెండు వైపులా ఇంజిన్లు ఉండటమే కాదు. రైలు మొత్తం నాన్ ఏసీగా రూపొందించారు.
అయితే.. జనరల్ సీట్లతో పాటు రిజర్వుడ్ సిట్టింగ్ స్లీపర్ బోగీలు ఉండనున్నాయి. ఈ రైలుకు 22 బోగీల్ని ఏర్పాటు చేస్తారు. ఈ రైలు గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దేశంలోని వివిధ నగరాలకు కలుపుతూ ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రయత్నంగా చెబుతున్నారు ఈ ప్రత్యేక రైలు అయోధ్యలో రామాలయ ప్రారంభానికి ముందే పట్టాల మీదకు వస్తోంది. ఈ నెల 30న అయోధ్యలో శ్రీరామ్ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. అనంతరం అయోధ్య జంక్షన్ లో నిర్మించిన కొత్త బిల్డింగ్ ను ప్రారంభించటమే కాదు.. అయోధ్య నుంచి ఢిల్లీకి నడిచేలా రెండు రైళ్లను ప్రారంభించనున్నారు.
ఎక్కువగా వర్కింగ్ క్లాస్ వారికి భారం లేకుండా ఉండేలా ఈ రైళ్లను ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు ముందే కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల మధ్య ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. ధరలు కూడా వందే భారత్ కంటే సగం ధర ఉంటుందని టాక్.. స్లీపర్ కోచ్ లతో నడిచే ఈ రైలు సామాన్య ప్రయాణీకులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అంటున్నారు.