హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇచ్చిందని అన్నారు.
ఈ సందర్భంగా ఆమ్రపాలికి హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బీ. ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్‌తో పాటు హెచ్ఎండీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కాగా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గానూ ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు.