జంతుప్రేమికులకి శుభవార్త..నేటి నుంచి నల్లమల్ల అందాలు వీక్షించేందుకు చక్కటి అవకాశం.ప్రకృతి ప్రేమికులకు నల్లమల అందాలతో అద్భుతమైన అనుభూతిని ఇచ్చేందుకు అటవీశాఖ సఫారీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యంపై ,పర్యాటకులకు అవగాహన పెంచడానికి, స్థానిక ఆదివాసులకు ఉపాధి కల్పించేందుకు ఈ సఫారీ కార్యక్రమాన్ని చేపట్టామని నాగర్ కర్నూల్ అటవీ శాఖ జిల్లా అధికారి కృష్ణాగౌడ్ తెలిపారు. సఫారీ యాత్ర చేసే వారు ఇద్దరైతే ఏసి గదిలో రెండు పడకలతో బస చేసేందుకు నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నలుగురైతే ఏడు వేల రూపాయలు, ఆరుగురైతే తొమ్మిది వేల రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. భోజనాలను ఆర్డర్ పై సమకూరస్తారు. గైడ్ కు రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి నల్లమల అడవిని మంచి టూరిజం స్పాట్ గా మార్చేందుకు నడుం బిగించారు అటవీ శాఖాధికారులు.అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో వైల్డ్ లైఫ్ టూరిజం చేపట్టింది.
నేటి నుంచి ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్న వారికి మొదటి రోజు మన్ననూరు నుంచి అడవి గుండా 4 కిలోమీటర్ల దూరంలో ఉమామహేశ్వరం వరకు ట్రెక్కింగ్ కు తీసుకెళ్తారు. సాయంత్రం ప్రత్యేక వాహనం మన్ననూరు కు తీసుకొచ్చి అడవిలోని కాటేజీల్లో రాత్రి భోజనం, బస ఏర్పాటు చేస్తారు. ఉదయం సఫారీలో భాగంగా ఫర్హాబాద్ తీసుకెళ్తారు. తిరుగు ప్రయాణంలో దట్టమైన అడవి గుండా మన్ననూరుకు చేరుకుంటారు. భోజనం అనంతరం బయోల్యాబ్ సందర్శన ఉంటుంది. అడవి జంతువులు, పెద్దపులులు, అడవులు వాటి ఆవశ్యకతపై లఘు చిత్రాలను చూపిస్తారు. నల్లమలలోని అరుదైన కీటకాలను ప్రదర్శిస్తారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో వివిధ రకాల జంతువుల గురించి వివరిస్తారు. వన్యప్రాణులు, అడవుల రక్షణ గురించి అవగాహన కల్పిస్తాడు. ఆదివాసి, గిహిజనులే పర్యాటకులకు ట్రెక్కింగ్, సఫారీ పర్యటనలో గైడ్ గా వ్యవహరిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily