ప్రపంచంలో తిరుగులేని నాయకుడు తానేనని భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో 77శాతం రేటింగ్‌తో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 56శాతం రేటింగ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ద్వితీయ, ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41శాతం రేటింగ్‌తో తృతీయ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో కెనడా ప్రధాని ట్రుడో, బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని కిషిండా నిలిచారు. ”మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్” ఈ సర్వే నిర్వహించి, 22 దేశాల అధినేతల రేటింగ్స్‌తో ఫలితాలు విడుదల చేసింది.
గత సర్వే నివేదికల్లో కూడా మోడీ అత్యంత ప్రజాదరణ గల నేతగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 75శాతం రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తాజా సర్వేలో మోడీ రేటింగ్ మరో 2శాతం పెరగడం గమనార్హం.