Saturday, November 23, 2024

TS | సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష.. విడుదలకు జైళ్లశాఖ కసరత్తు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ నేరాలలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో సత్‌ప్రవర్తన కలిగిన 231 మందిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవిత ఖైదూ అనుభవిస్తూ అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర సమస్యలతో బాధ పడుతున్న ఖైదీల శిక్షాకాలన్ని తగ్గిస్తూ క్షమాభిక్ష ప్రసాదిస్తూ విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో సత్‌ ప్రవర్తన కలిగిన 231 ఖైదీలను విడుదల చేయనున్నారు.

క్షమాభిక్షకు అర్హులైన వారిలో 212మంది జీవితకాల ఖైదీలు కాగా, మరో 19మంది జీవితేతర ఖైదీలుగా ఉన్నట్లు జైళ్ల శాఖ అధికారులు వివరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఖైదీల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ప్రత్యేక రాష్ట్రం అవిర్భావం అనంతరం రెండు విడతలలో గత ప్రభుత్వం 400 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016, 2020లో మరోసారి ఖైదీలను విడుదల చేశారు. ఆ తర్వాత ప్రభుత్వనికి, గవర్నర్‌కు మధ్య వివాదాల కారణంగా ఖైదీల విడుదల సాధ్యం కాలేదు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్త ర్వులతో 231 మంది ఖైదీలు విడుదల కానున్నారని, వీరిలో 212మంది జీవితఖైదీలు కాగా , మరో 12 మంది వివిధ నేరాలలో శిక్ష పడిన వారున్నారని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement