ఏపీలోని జీవిత ఖైదీలకు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురును అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న 175 మందికి క్షమాభిక్షను ప్రసాదించింది. వారిని విడుదల చేయాలని హోం శాఖ కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే విడుదలవుతున్న ఖైదీలు 50వేల రూపాయల పూచికత్తు సమర్పించాలని సూచించింది. విడుదల అవుతున్న వ్యక్తులు మూడు నెలలకొకసారి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement