కరోనా కట్టడికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రూ. 2 కోట్లు విరాళమిచ్చారు. ఢిల్లీలోని రకబ్ గంజ్ గురుద్వారాను కోవిడ్ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో దీనికి ఆయన రూ. 2 కోట్లు విరాళమిచ్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్ వెల్లడించారు. 300 పడకలు గల ఈ కేంద్రం నేటి నుండి ప్రారంభం కానుండగా, ఈ కేంద్రానికి విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు ఇతర వైద్య పరికరాలను కూడా తెప్పిస్తానని అమితాబ్ బచ్చన్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. బిగ్ బీ ప్రతి రోజూ ఫోన్ చేసి ఈ కేంద్రానికి అవసరమైన సదుపాయాల గురించి ఆరా తీస్తున్నారట. రానున్న రోజుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మాటిచ్చారన్నారు మజిందర్ సింగ్.
కరోనా కట్టడికి అమితాబ్ 2 కోట్లు సాయం
- Tags
- Amitabh bachan
- breaking news telugu
- corona bulitin
- corona bulletin
- corona cases
- COVAXIN
- first dose
- icmr
- immunity
- india corona cases
- latest breaking news
- latest news telugu
- lockdown second wave
- sanitizier
- second dose
- second vaccination
- second wave
- telugu epapers
- telugu latest news
- telugu trending news
- vaccination
- VACCINE
- viral news telugu
- wear mask
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement