కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు…. స్టే విధించింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తూ… ఈ కేసులో ముందస్తు విచారణ చేపట్టవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
రిజర్వేషన్లు ఎత్తివేస్తాం అంటూ అమిత్ షా మాట్లాడినట్లుగా ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందుకు బాధ్యులైన ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రాథమిక విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇక ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.