Tuesday, November 19, 2024

జయప్రకాశ్​ నారాయణ్​ గురించి అమిత్‌షాకి ఏం తెలుసు?.. నితీశ్ కుమార్ ఫైర్​​

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. జయప్రకాశ్‌ నారాయణ్‌ శిష్యులు అధికారం కోసం కాంగ్రెస్‌ ఒడిలో కూర్చున్నారని అమిత్‌ షా అంటే, 20 ఏళ్ళ క్రితం రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తిని పట్టించుకోనని నితీశ్‌ కుమార్‌ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన అమిత్‌షా, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ (జేపీ) స్వస్థలం సితాబ్‌ దియారాలో మంగళవారం పర్యటించారు. జేపీ శిష్యులు ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్‌ ఒళ్లో కూర్చున్నా రంటూ పరోక్షంగా నితీశ్‌ను విమర్శించారు.

దీనిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు నితీశ్‌ బుధవారం బదులిచ్చారు. ”మీరు ప్రస్తావించిన వ్యక్తికి, జేపీ దేనికి కట్టుబడి ఉన్నారో ప్రత్యక్షంగా ఏమైనా తెలుసా? 1974నాటి జేపీ ఉద్యమంలో మేం ప్రేరణ పొందాం. కేవలం 20ఏళ్ళ క్రితం రాజకీయ జీవితం ప్రారంభించిన వారి గురించి నేను మాట్లాడను’ అని చెప్పారు. అయితే వారికి (అమిత్‌ షాకు) ఇప్పుడు అధికారం ఉందనేది వాస్తవమని చెప్పారు. వారిని మీడియా బాగా హైలైట్‌ చేస్తోందన్నారు. తన గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఢిల్లిలోని అన్ని ఇంగ్లిష్‌ వార్తా పత్రికలు ప్రచురిస్తున్నాయన్నారు. కానీ తాను కొంచెం కూడా పట్టించుకోనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement