అమెరికా ఆర్ధిక పరిస్థితి సంక్షోభం దిశగా కదులుతోంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ పతనం అంచున ఉంది. కొత్తగా రుణాలు తీసుకోకుంటే ఆర్ధిక విపత్తును ఎదుర్కోక తప్పదని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇందు కోసం రుణ గరిష్ట పరిమితిని పెంచడానికి చట్టసభ ఆమోదం పొందడం తప్పనిసరిగా మారింది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ పతనమైతే, దాని ప్రభావంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కూడా కూప్పకూలే ప్రమాదం ఉంది. దీని ప్రభావం అన్ని దేశాలపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్ట సభల్లో రుణ పరిమితిపై అనుమతి తీసుకోకుంటే అమెరికా ప్రమాదంలో పడుతుందని, దీని వల్ల దేశంలో భద్రతా పరమైన సమస్యలు కూడా తలెత్తుతాయని ఆ దేశ ఆర్ధిక మంత్రి జానెట్ యల్లెన్ ఇటీవల హెచ్చరించారు. కొన్ని వారాల్లో అమెరికా ఖజానా ఖాళీ అవుతుందని ఆయన తెలిపారు.
ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మరిన్ని అప్పులు చేయాల్సి ఉందని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. గరిష్ట రుణపరిమితిని పెంచడానికి చట్టసభల ఆమోదం తప్పనిసరి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, దీనిపై సాధ్యమైనంత త్వరగా రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించాల్సి ఉందని ఆర్ధిక మంత్రి జానెట్ యెల్లెన్ అభిప్రాయపడ్డారు. అదనంగా రుణాలు తీసుకోకుంటే సకాలంలో చెల్లింపులు చేయడం సాధ్యంకాన్నారు. ఇదే జరిగితే అమెరికా దివాలా తీస్తుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డెట్ సీలింగ్ అంటే…
అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణాలపై గరిష్ట పరిమితిని డెట్ సీలింగ్ అని వ్యవహరిస్తున్నారు. దీని ప్రకారం నిర్ధేశించిన పరిమితికి మించి ప్రభుత్వం అప్పులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, సామాజిక భద్రత, మెడికేర్, రుణాలపై వడ్డీల చెల్లింపులు, పన్ను రిఫండ్లు వంటి అనేక ఖర్చులు చెల్లింపుల కిందకు వస్తాయి. మరిన్ని అప్పులు చేసేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. ఇప్పటికే అమెరికా పరిమితికి మించి అప్పులు చేసింది. ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశాల్లో అమెరికా కూడా ఉంది.
ప్రస్తుతం అమెరికా రుణ సీలింగ్ 31.4 బ్రి లియన్ డాలర్లుగా ఉంది. అమెరికా చేసే అప్పుల మొత్తం దీనికంటే ఎక్కువగా ఉండేందుకు వీలులేదు. జనవరిలోనే ప్ర భుత్వం ఈ రుణ సీలింగ్ పరిమితిని దాటేసింది. ప్రత్యేక చర్యల ద్వారా ఆర్ధిక శాఖ నిధులు సమకూర్చుతున్నది. కొత్త రుణాలు తీసుకునేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమెదం విషయంలో రాజకీయంగా చిక్కులు ఏర్పడుతున్నాయి. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు మోజార్టీ ఉంది. రుణ పరిమితిన పెంచాలని కోరుతున్న అధికార డెమోక్రాట్ల ప్రతిపాదనను రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా రుణాలు తీసకునే కంటే ఖర్చులు తగ్గించుకోవాలని, ఆర్ధిక నిర్వహణ మెరుగుపరుచుకోవాలని కోరుతున్నారు.
రుణ పరిమితి పెంచకుంటే ప్రభుత్వం చేసే చెల్లింపుల పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫలితంగా ఆర్ధిక సంక్షోభం పెద్దదవుతుంది. ఆర్ధిక వ్యవస్థ వేగంగా పతనం అయ్యే ప్రమాదం ఉంటుంది. సకాలంలో రుణాల వడ్డీలు చెల్లించకుంటే దివాలాకు దారితీస్తుంది. దీని వల్ల ఏజెన్సీలు అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తాయి. దీని వల్ల కొత్త రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రిటైల్ రుణాల రేట్లు పెరుగుతాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయి. ఆర్ధిక వ్యవస్థ సం క్షోభంలోకి జారుకుంటుంది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారు.
రుణ పరిమితిని పెంచేందుకు చట్ట సభ ఆమోదించకపోతే ఆర్ధిక శాఖ తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపులను నిలిపివేయాలి, వేతనాలు, పింఛన్లు నిలిపివేయాలి. పెట్టుబడులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం భారీగా ఖర్చులు తగ్గించుకుంటే కొంత వరకు ఆర్ధిక వ్యవస్థ గండం కట్టె క్కేందుకు అవకాశం కలుగుతుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెట్ సీలింగ్ పెంచేందుకు అనుమతి లభించకుంటే పన్నులు పెంచి ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.