Friday, November 22, 2024

మోడీకి అమెరికా మీడియా ప్రశంసలు..

ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఇది సమయం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌కు భారత ప్రధాని మోడీ చెప్పడాన్ని అమెరికా మీడియా ప్రశంసించింది. ఉక్రెయిన్‌లో యుద్ధంపై పుతిన్‌ను మోడీ మందలించారు అని వాషింగ్టన్‌పోస్ట్‌ ప్రధాన శీర్షికలో ప్రచురించింది. అద్భుతమైన రీతిలో బహిరంగ మందలింపు చేశారు. నేటి యుగం యుద్ధయుగం కాదు.. దీని గురించి నేను మీతో ఫోన్‌లో మాట్లాడాను అని మోడీ వ్యాఖ్యానించినట్లు అమెరికా ప్రధాన దినపత్రికి నివేదించింది. ఈ మందలింపు ద్వారా 69 ఏళ్ల రష్యన్‌ అధ్యక్షుడు అన్నివైపుల నుంచి అసాధారణ ఒత్తిడికి గురవుతున్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది.

న్యూయార్క్‌ టైమ్స్‌ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఇది యుద్ధయుగం కాదని పుతిన్‌ను భారత నాయకుడు హెచ్చరించారు అని న్యూయార్క్‌టైమ్స్‌ ప్రచురించింది. సమావేశ స్వరం స్నేహపూర్వకంగా ఉంది. ఇద్దరు నాయకులు తమ సుదీర్ఘ చరిత్రను ప్రస్తావించారు. మోడీ తన వ్యాఖ్యలకు ముందు.. ఉక్రెయిన్‌లో యుద్ధం గురించి భారతదేశ ఆందోళనలను తాను అర్థం చేసుకున్నట్లు పుతిన్‌ చెప్పారు అంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement