Friday, November 22, 2024

అమెరికా వైద్యుల ఘనత.. బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తికి పంది కిడ్నీలు..

అమెరికా వైద్యులు మరో ఘనత సాధించారు. ఇటీవల పంది గుండెను మనిషికి మార్పిన చేసిన డాక్టర్లు.. ఈసారి పంది కిడ్నీలను బ్రెయిన్‌ డెడ్‌ రోగికి అమర్చారు. ఈ ఆపరేషన్‌ విజయవంతం కూడా అయినట్టు ప్రకటించారు. అలబామా విశ్వ విద్యాలయానికి చెందిన వైద్యులు.. జెన్యూ మార్పిడి చేసిన ఓ పంది నుంచి సేకరించిన మూత్ర పిండాలను సదరు వ్యక్తికి అమర్చారు. అనంతరం మూడు రోజుల పాటు వాటి పనితీరును పరిశీలించారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన అతని శరీరం.. పంది మూత్ర పిండాలను తిరస్కిస్తున్న సంకేతాలు ఏవీ లేవని అలబామా విశ్వ విద్యాలయ వైద్యులు ప్రకటించారు. మూడు రోజులు కిడ్నీలు ఎంతో బాగా పని చేసినట్టు వివరించారు.

ఒకదాని తరువాత ఒకటి క్రమ పద్ధతిలో రిహార్సల్‌ చేపట్టి.. కిడ్నీ మార్పిడి చేసినట్టు తెలిపారు. పందికి ఉన్న ఎలాంటి వైరస్‌ ఆయనకు సోకలేదని, రక్తంలో పంది కణాలు కూడా ఏవీ కనిపించలేదని డాక్టర్లు వెల్లడించారు. మనుషుల అవయవాలు అమర్చినట్టే ఆరంభం నుంచి ముగింపు వరకు ఈ చర్య చేపట్టామని, సురక్షితంగా ఈ ప్రక్రియను విజయవంతం చేశామని అలబామా విశ్వ విద్యాలయ వైద్యురాలు జేమీ లాకీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అవయవాలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో.. తాజా ప్రయత్నం ఆ సమస్యను పరిష్కరించనుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement