Monday, September 23, 2024

America – ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ను సాంకేతిక‌ను ప్రొత్స‌హిస్తాం – మోడీ

బార‌త్ కు మీరంతా చేయూత ఇవ్వండి
ఐటి రంగాల‌లో అగ్ర‌ప‌థంలో భార‌త్ ను నిలుపుతా
ప్ర‌ముఖ ఐటి సంస్థ‌ల సిఈవోల‌తో మోదీ భేటి
అమెరికాలో మ‌రో రెండు రాయ‌బార కార్యాల‌యాలు
బైడ‌న్ కు వెండి రైలు, జిల్ కు క‌శ్మీర్ శాలువ బ‌హుక‌ర‌ణ

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్గజ టెక్ కంపెనీల సీఈవోల తో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా మోదీ మాట్లాడుతూ.. “గతేడాది వాషింగ్టన్ వచ్చినప్పుడు మీలో కొందరితో సమావేశమయ్యే అవకాశం లభించింది. మరోసారి ప్రపంచంలో ప్రముఖ ఆవిష్కర్తలతో కూర్చోవడం గర్వంగా ఉంది. భారత్ పై మీకున్న ఉత్సాహం, నమ్మకం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. మీరు ఇచ్చిన సూచనలు ఎంతో విలువైనవి” అని అన్నారు. న్యూయార్క్ ప్యాలెస్ హోటల్‌లో గ‌త రాత్రి జరిగిన ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో భారతదేశం వృద్ధిని మోదీ వివ‌రించారు.. ఈ రంగాల్లో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా మార్చేందుకు కృషి చేయడంలో ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను నొక్కి చెప్పారు. భార‌త్ లో ఐటి రంగం మ‌రింత పురోగ‌మించేంద‌కు ఇక్క‌డి సంస్థ‌లు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌ధాని కోరారు.

- Advertisement -

ఇక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై మోదీ మాట్లాడుతూ, ‘AI ఫర్‌ ఆల్‌ విధానంతో బాధ్యతాయుతమైన, నైతిక పద్ధతిలో AIని ప్రోత్సహించడానికి భారత్‌ కట్టుబడి ఉంది. భారతదేశం, యూఎస్‌ మధ్య ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి కార్యక్రమాల ద్వారా సమగ్ర గ్లోబల్‌ స్ట్రాటెజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ బలోపేతం చేయడం కీలకం.’ అని చెప్పారు.

భార‌త్ మార్చేందుకు మోదీ కృషి..

అనంతరం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. “భారతన్ను మార్చడంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఇది డిజిటల్ ఇండియా విజన్. భారత్లోనే తయారీ, డిజైనింగ్ ఉండాలని ఆయన మమ్మల్ని అడిగారు. ఇప్పుడు మా పిక్సెల్ ఫోన్లను భారత్లో తయారుచేయడం గర్వంగా ఉంది. ఏఐతో భారత ప్రజలకు లభించే ప్రయోజనాల గురించి మోదీ ఆలోచిస్తున్నారు. ఈ సరికొత్త సాంకేతికతను విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగించేలా ఆలోచించేలా ఆయన మాకు సవాలు విసిరారు. భారత్లో ఏఐ మరింత విస్తరించేలా మేం ముందుకువెళ్తున్నాం. మోదీ స్పష్టమైన విజన్లో ఆలోచనలు చేస్తున్నారు” అని పిచాయ్ అన్నారు.

కాగా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హాంగ్ సహా 15 కంపెనీల సీఈవోలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. సీఈవోలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అంశాల గురించి
చర్చించామని తెలిపారు. `మేడ్ బై ఇండియా’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు.

మ‌రో రెండు న‌గ‌రాల‌లో రాయ‌బార కార్యాల‌యాలు.

అమెరికాలోని బోస్టన్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో భారతీయ రాయబార కార్యాలయాలను ( ఇండియన్ కాన్సులేట్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. న్యూయార్క్‌లోని నాస్సు వెటరన్స్ కొలిసియమ్‌లో భారతీయ అమెరికన్ల సమావేశంలో మాట్లాడుతూ మోదీ ఈ ప్రకటన చేశారు. ఈ రెండు నగరాల్లో రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉందన్న విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.

గతేడాది సిటెల్స్‌లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించామని తెలిపారు. నేడు ఆ కార్యాలయం పని చేస్తుందన్నారు. అదే సమయంలో ఈ రెండు నగరాల్లో సైతం రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయాలంటూ మీరు.. తనకు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రకటన చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. . ఇక ప్రకటనను లాస్ ఏంజెల్స్ లోని భారతీయ అమెరిక సమాజం స్వాగతించింది. ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, యూఎస్‌లోని భారత మాజీ రాయబారి తరణ్‌జిత్ సందులకు భారతీయ సమాజం కృతజ్జతలు తెలిపింది.

బైడెన్‌కు వెండిరైలు.. జిల్‌కు కశ్మీర్‌ శాలువ

క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన మోదీ వెండిరైలు నమూనాను అధ్యక్షుడు జో బైడెన్‌కు కానుకగా ఇచ్చారు. ఆవిరితో నడిచే రైలింజను కాలపు ఈ నమూనాపై భారత్, అమెరికాల నడుమ ఉన్న పటిష్ఠమైన స్నేహ సంబంధాలను సూచిస్తూ ”దిల్లీ – డెలవేర్‌” అనే నామఫలకంతోపాటు ”ఇండియన్‌ రైల్వేస్‌” అని మరో సూచిక ఏర్పాటు చేశారు. . అలాగే అమెరికన్‌ ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు జమ్మూకశ్మీర్‌ హస్తకళల విశిష్టతను చాటే పశ్మీనా శాలువను మోదీ బహూకరించారు. కాగితపు గుజ్జు, జిగురు, ఇతర సహజ సామగ్రి కలిపి చేతితో కళాత్మకంగా తయారుచేసిన అందమైన పెట్టెలో ఈ శాలువను అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement