Friday, November 22, 2024

America – అధ్యక్ష బరిలో కమలా హారిస్… సెప్టెంబర్ నాలుగున ట్రంప్ తో ఓపెన్ డిబేట్..

అధికారికంగా ప్రకటించిన డెమోక్రటిక్‌ పార్టీ
సెప్టెంబర్ నాలుగున ట్రంప్, హారిస్ మధ్య బిగ్ డిబేట్
పెన్సిల్వేనియా వేదికగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున కమలా హారిస్‌ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆమెతో ముఖాముఖి చర్చ జరిపేందుకు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఫాక్స్‌న్యూస్‌ ఆఫర్‌ను ఆయన అంగీకరించారు. ఈవిషయాన్ని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియా ఖాతాలో తాజాగా వెల్లడించారు. వచ్చే నెలలో వీరి మధ్య డిబేట్‌ జరగనుంది.

- Advertisement -

ట్రంప్- హారిస్ చేత లైవ్ డిబేట్ నిర్వహిస్తామని ఫాక్స్ న్యూస్ వెల్లడిచింది. ఈ విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 4వ తేదీన జరిగే చర్చలో పాల్గొంటానని ట్రంప్ అంగీకారం తెలిపారు. . దీంతో డొనాల్డ్ ట్రంప్- కమలా హారిస్ మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పెన్సిల్వేనియాలో తొలి చర్చ జరగనుంది. చర్చ జరిగే సమయంలో చుట్టూ ప్రేక్షకులు కూడా ఉంటారు. ఆ చర్చకు బ్రెట్ బెయిర్, మార్తా మెక్‌కల్లం వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు. గత చర్చ వేదికల మాదిరిగా నిబంధనలు వర్తిస్తాయని ఫాక్స్ న్యూస్ స్పష్టం చేసింది.

ఓకే అన్న కమలా..

ట్రంప్‌తో చర్చకు సంబంధించి ఫాక్స్ న్యూస్ కమలా హారిస్‌కు సమాచారం అందజేసింది. ట్రంప్‌తో జరిగే డిబేట్‌కు సిద్ధంగా ఉన్నానని ఆమె కూడా వెల్లడించారు . మెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కమలా హారిస్‌తో చర్చ చేయాలని జూలై 21వ తేదీన ట్రంప్‌కు ఫాక్స్ న్యూస్ ప్రతిపాదన చేసింది. కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థి అధికారికంగా కాలేదని, ఆమెతో చర్చ చేయనని ఆ సమయంలో ట్రంప్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఎంపిక కావడంతో ట్రంప్ కూడా చర్చకు సై అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement