అగ్రరాజ్యం అమెరికా హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసిన హైపర్‌సోనిక్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్ అయినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. హైపర్‌సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ వెపన్ కాన్‌సెప్ట్ (హెచ్‌ఏడబ్ల్యూసీ) ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పరీక్ష జరిగింది. అయితే రష్యాను రెచ్చగొట్టవద్దు అన్న ఉద్దేశంతో బైడెన్ సర్కార్ ఆ పరీక్షను రహస్యంగా చేపట్టినట్లు తెలుస్తోంది. పశ్చిమ తీరంలో బీ–52 బాంబర్ నుంచి స్క్రామ్‌జెట్ మిస్సైల్‌ను పరీక్షించారు. దీనికి అమర్చిన బూస్టర్ ఇంజిన్ మిసైల్‌ను అత్యధిక వేగానికి తీసుకెళ్లింది. అదే సమయంలో ఎయిర్ బ్రీతింగ్ స్క్రామ్ జెట్ కూడా పనిచేయడం మొదలుపెట్టి క్షిపణిని శబ్దానికి ఐదు రెట్ల వేగానికి చేర్చింది. ఈ క్షిపణి 65,000 అడుగుల ఎత్తులో దాదాపు 300 మైళ్లు ప్రయాణించింది. రక్షణ శాఖ అధికారు లు ఈ పరీక్షపై అతితక్కువ సమాచారం వెల్లడించారు. అయితే ఎంత స్పీడ్‌తో ఆ ప్రొజె్టకల్ వెళ్లిందో చెప్పలేదు.
కనీసం మాక్-5 స్థాయిలో, అంటే ధ్వని వేగం కన్నా అయిదు రెట్ల అధిక వేగంతో ఆ క్షిపణి ప్రయాణించి ఉంటుందని భావి స్తున్నారు. మార్చి మధ్యలో అధ్యక్షుడు జోబైడెన్ ఐరోపా పర్యటనకు ముందు ఇది జరిగిందని ఆ దేశ రక్షణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మాత్రం రష్యా హైపర్ సోనిక్ ఆయుధాలు పెద్దగా గేమ్ ఛేంజర్లు ఏమీ కావని పేర్కొన్నారు. మరోపక్క పెంటగాన్ ప్రతినిధి జాన్ కెర్బీ మాట్లాడుతూ.. స్థిరంగా గోదాములపై హైపర్ సోనిక్ ఆయుధాలను ప్రయోగించడాన్ని ఏమనాలో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఐసీబీఎం పరీక్షలను కూడా అమెరికా రద్దు చేసినట్లు తెలుస్తోంది. రష్యా వద్ద కింజాల్, సిర్కాన్ హైపర్ సోనిక్ మిస్సైళ్లు ఉన్న విషయం తెలిసిందే. కానీ హైపర్ సోనిక్ వెపన్స్ విషయంలో రష్యా, చైనా కన్నా అమెరికా వెనుకబడి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..