Wednesday, January 29, 2025

America – ఉక్రైయిన్ కు ట్రంప్ షాక్ …. ఆర్ధిక‌,సైనిక సాయం నిలిపివేత‌…

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు షాకిచ్చారు..ఉక్రెయిన్ సహా చాలా దేశాలకు అందిస్తున్న ఆర్థిక, సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కేవలం ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలకు తమ ఆర్థిక, సైనిక సహాయం కొనసాగుతుందని తెలిపారు.

కాగా, తదుపరిగా రష్యాతో శాంతి చర్చలు జరిపి, యుద్ధాన్ని ఆపే క్రమంలోనే ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని ట్రంప్ ఆపేసినట్లు స‌మాచారం. అమెరికా నిధులు విదేశాలకు మళ్లడాన్ని ఆపుతానని, వాటిని తమ దేశ వికాసానికి వినియోగిస్తానని ట్రంప్ మొదటినుంచీ చెబుతూ వస్తున్నారు. డీలాపడిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పొందాలంటే విదేశాలకు సాయాలను ఆపాలనేది ట్రంప్ వాదన. పశ్చిమాసియాలో అమెరికాతో వ్యూహాత్మక సైనిక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న ఇజ్రాయెల్, ఈజిప్టులకు మాత్రం సాయాన్ని కంటిన్యూ చేయనున్నారు.

- Advertisement -

ట్రంప్ నిర్ణ‌యంతో ఉలిక్కిపడ్డ ఉక్రెయిన్ తదుపరిగా ఏం చేస్తుందో వేచిచూడాలి. రష్యా లాంటి అణ్వాయుధ దేశంతో గత రెండున్నర ఏళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం చేసిందంటే దానికి కారణం.. అమెరికా చేసిన సాయం!! లేదంటే ఇప్పటివరకు యుద్ధ బరిలో రష్యా ఎదురుగా ఉక్రెయిన్ నిలువలేకపోయేది.. ఇది ఇలా ఉంటే ఉక్రైయిన్ అధ్య‌క్షుడు జెల‌నస్కీ యుద్ద విర‌మ‌ణ‌ను కోరుకుంటున్నారు. అయితే అత‌డు ప్ర‌తిపాదించిన రాజీకి ర‌ష్యా అంగీక‌రించ‌క‌పోవ‌డంతో యుద్ధం కొన‌సాగుతున్న‌ది.. ఇప్ప‌డు ట్రంప్ రంగప్ర‌వేశంతో ర‌ష్యా ఒక మెట్టుదిగే అవ‌కాశం ఉందంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement