Friday, January 17, 2025

America వైట్ హౌజ్ పై దాడి …సాయి వర్షిత్ కు ఎనిమిదేళ్లు జైలు..

వాషింగ్టన్ డిసి – అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద 2023లో భారత సంతతి యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడైన తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను అప్పట్లోనే పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్‌ వెల్లడించారు.

నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువకుడు యత్నించాడని పేర్కొన్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌ను హత్య చేయాలనే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అతడు ఆరు నెలలుగా ప్లాన్‌ చేసి మరీ ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. ఈవిషయాన్ని సాయివర్షిత్‌ విచారణలో అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్‌ ఏజెంట్ వర్గాలు మీడియాకు తెలిపాయి. దీంతో అతడిని అరెస్ట్‌ చేశారు. నేడు అతడికి అక్క‌డి న్యాయ‌స్థానం శిక్ష ఖ‌రారు చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement