Sunday, November 24, 2024

America Results – ట్రంప్ కే అమెరిక‌న్ల ప‌ట్టం… క‌మ‌లా హ్యారీస్ కు నిరాశ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.. అద్యక్ష ప‌ద‌వికి అవ‌స‌ర‌మైన 270 ఎల‌క్ట్రోర‌ల్ ఓట్ల కంటే ఆయ‌న అధికంగా సాధించారు.. దీంతో ఆయ‌న ఆమెరికాకు రెండో సారి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం . ప్రస్తుతం 277 ఎలక్టోరల్ ఓట్లు ఆయ‌న‌కు ల‌భించాయి.. క‌మ‌లా హ్యారీస్ 214 ఓట్లు మాత్ర‌మే సాధించ‌గ‌లిగారు.

కాగా, ఈ ఎన్నికల్లో గెలిచి అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని భావించిన కమలా హ్యారిస్ మరోసారి తుది ఫలితాలతో డీలా పడ్డారు. విజయంపై పూర్తి ధీమాతో ముందస్తుగా ఏర్పాటు చేసిన స్పీచ్ ను ఆమె క్యాన్సిల్ చేసుకున్నారు. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో కమలా హ్యారిస్ మంగళవారం రాత్రి వాచ్ పార్టీ ఏర్పాటు చేయగా.. ఆమె మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఈ పార్టీకి వచ్చారు. కానీ, కమలా హ్యారిస్ వెనుకంజలో ఉండడంతో హరీస్ మద్దతుదారులు కన్నీళ్లతో ఇళ్లకు వెళ్లిపోయారు. హోవార్డ్ విశ్వ విద్యాలయం నుంచి కమల సపోర్టర్స్ విచారంగా బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమలా హరీస్ ఇప్పటి వరకు 214ఎలక్టోరల్ సీట్లను దక్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement