అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటివరకు మొత్తం 32 రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. 18 రాష్ట్రాలలో ఓటింగ్ కొనసాగుతుంది.
ఇక ఓటింగ్ ముగిసిన రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతున్నది . ఫలితాలలో డోనాల్డ్ ట్రంప్ లీడ్ లు ఉన్నారు. ట్రంప్ 210 ఎలక్ట్రోల్ వోట్లు సాధించగా , కమలా హ్యారిస్‌కు 113. ఎలక్ట్రోల్ వోట్లు లభించాయి. అధికారంలోకి రావడానికి ప్రతి స్టేట్‌లోనూ 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరమౌతాయి. మొత్తం 50 రాష్ట్రాలు ఉన్న అమెరికాలో ఏడు మాత్రమే అధ్యక్షుడిని నిర్ధారిస్తాయి. మిగిలిన రాష్ట్రాల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు స్టాండర్డ్ ఓటుబ్యాంక్ ఉండటమే దీనికి కారణం.
అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవడాల్లో అధిక శాతం ఓట్లను పొందిన వాళ్లదే విజయం.
- Advertisement -