Saturday, November 16, 2024

America – అమెరికా సెనెట్‌ రిపబ్లికన్ల చేతికి ..

హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో కూడా ట్రంప్ పాగా
రెండు స‌భ‌ల‌లో ట్రంప్ పార్టీకే ప‌ట్టు
ఏ నిర్ణ‌యం తీసుకున్నా ట్రంప్ కు ఎస్సే…

అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో కూడా ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ సెనెట్‌పై పట్టు బిగించింది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి లభించాయి. మరోవైపు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో కూడా ముందంజలో ఉంది. మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్‌లో 34 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా చేజారిపోయింది.

తాజాగా రిపబ్లికన్లకు 51 మంది.. డెమోక్రట్లకు 42 మంది ఉన్నారు. మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది.

ఈ ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సరికొత్త కార్యవర్గం ఎంపిక, ఒకవేళ ఖాళీ అయితే సుప్రీంకోర్టు జడ్జి నియామకంలో రిపబ్లికన్లకు పట్టు లభించినట్లైంది. రానున్న సంవత్సరాల్లో ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు రిటైర్‌ కానుండటంతో ఈ ఫలితాలు రిపబ్లికన్లలో ఉత్సాహాన్ని నింపాయి.

- Advertisement -

ఇక 435 స్థానాలున్న హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు లభించాయి. గతంతో పోలిస్తే ఒకటి ఎక్కువ. మరోవైపు డెమోక్రట్లు 154 స్థానాలు సాధించారు. దీంతో ఈసారి ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాల‌కు కాంగ్రెస్‌ నుంచి పెద్దగా సమస్యలు ఎదురుకావ‌ని అంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement