Friday, November 22, 2024

America – ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం..

ర్యాలీ సమీపంలో గన్‌లతో సంచారం
నిందితుడు శ‌నివారమే జైలు నుంచి విడుద‌ల‌
సెక్యూరిటీ అప్ర‌మ‌త్త‌తో త‌ప్పిన ముప్పు

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల కాలిఫోర్నియాలోని కోచెల్లాలో నిర్వహించిన ట్రంప్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి రెండు గన్‌లతో సంచరిస్తున్నారు.. దీనిపై సమాచారం అందుకున్న సీక్రెట్ సర్వీసెస్ ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ని లాస్‌వెగాస్‌కు చెందిన వేం మిల్లర్‌(49)గా గుర్తించామని పోలీసులు పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడు నకిలీ ప్రెస్‌కార్డు, ఎంట్రీ పాస్‌తో ర్యాలీ వేదికకు సమీపంలో లోడ్ చేసిన షాట్‌గన్, హ్యాండ్‌గన్, హై కెపాసిటీ గల మ్యాగజైన్‌తో తిరుగుతుండగా, అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నిందితుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే మితవాద సంస్థలో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించామన్నారు. సీక్రెట్‌ సర్వీసెస్‌ సహాయంతో ట్రంప్‌పై జరగబోయే మరో హత్యాయత్నాన్ని ఆపగలిగామని అన్నారు. రివర్‌సైడ్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు శనివారమే జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడని, అతడి వాహనానికి కూడా రిజిస్ట్రేషన్‌ లేదని పేర్కొన్నారు. కారులో మందుగుండు సామగ్రి, తుపాకులు లభించాయన్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సైతం ఉండటంతో హత్య అనంతరం విదేశాలకు పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement