Saturday, September 7, 2024

America – ట్రంప్ స‌భ‌లో క‌త్తుల‌తో దాడి … ఒక‌రి కాల్చివేత

న్యూయార్క్ – ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తరువాత గ‌త రాత్రి మిల్ వాకీ నగరంలో జరిగిన ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో ఒక గుర్తు తెలియన వ్యక్తి తన రెండు చేతులలో కత్తులు పట్టుకొని జనంపై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతడిని కాల్చి చంపారు. ఈ కార్యక్రమానికి ముందు ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి ఏకె-47 తుపాకీ పట్టుకొని తిరుగుతుండడం చూసి . అతడిని అనుమానంపై పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం మ‌రో వ్య‌క్తి క‌త్తుల‌తో దాడికి పోలీసులు అత‌డిని కాల్చివేశారు.. . దీనిపై మేయర్ స్పందించారు. నగర ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని.. కేవలం రాజకీయ కార్యక్రమానికి సంబంధించే ఈ దాడి జరిగిందని, దుండ‌గుడిని పోలీసులు మ‌ట్టుబెట్టార‌ని చెప్పారు..

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement