Monday, January 20, 2025

America – చివరిక్షణంలో ట్రంప్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జో బైడెన్

వాషింగ్టన్ – కాసేపట్లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు. విదేశాల నుండి వచ్చిన ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు.

కనీ విని ఎరుగని రీతిలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడిగా మరికాసేపట్లో కుర్చీ దిగబోతున్న జో బైడెన్ ట్రంప్ కు ఊహించని షాక్ ఇచ్చారు.వారికి క్షమాభిక్ష మంజూరు చేసిన జో బైడెన్..

రాబోయే ట్రంప్ ప్రభుత్వం నుంచి కొందరు కీలక వ్యక్తులను రక్షించడానికి జో బైడెన్ కొన్ని సాహసోపేతమైన చర్యలకు దిగారు. డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లి, జనవరి 6 2021 వ తేదీన యుఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన కేసును దర్యాప్తు చేసిన హౌస్ కమిటీ సభ్యులకు జో బైడెన్ క్షమాభిక్ష మంజూరు చేశారు.

- Advertisement -

.ట్రంప్ వారిపై రివెంజ్ తీర్చుకోకుండా కాపాడిన బైడెన్

ఇక ఈ చర్యతో వారు సంబంధిత కేసులలో నేరానికి పాల్పడినట్టు తేలినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా బైడెన్ వారిని కాపాడారు. సంబంధిత కేసులలో వీరికి శిక్ష గాని జరిమానా కానీ లేకుండా ఈ నిర్ణయంతో ట్రంప్ వారిపై రివెంజ్ తీర్చుకోకుండా ఆయన అద్భుతమైన స్కెచ్ వేశారు. చివరిసారిగా తన పవర్స్ యూజ్ చేసిన బైడెన్ ట్రంప్ ఎనిమీస్ లిస్ట్ లో వీరు ఉంటారని భావించి వీరిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్రంప్ నుండి జో బైడెన్ కాపాడింది వీరినే

బైడెన్ ట్రంప్ ను వ్యతిరేకించిన డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, జనరల్ మార్క్ మిల్లె, జనవరి 6వ తేదీన క్యాపిటల్ తిరుగుబాటులో ట్రంప్ పాత్ర పై దర్యాప్తు చేసినటువంటి సభ్యులు వీరందరికీ క్షమాభిక్షను ప్రకటించడం ద్వారా ట్రంప్ నుంచి వీరిని కాపాడారు. వీరిని కచ్చితంగా ట్రంప్ టార్గెట్ చేస్తారని భావించి చట్టపరమైన, రాజకీయ దాడుల నుంచి రక్షించడం కోసం వీరికి క్షమాభిక్షను మంజూరు చేశారు.

.ఈ చర్యతో ట్రంప్ ప్లాన్ కు బ్రేక్ వేసిన బైడెన్2020 ఎన్నికల ఫలితాలను తిరస్కరించి క్యాపిటల్ పై దాడికి దారి తీసిన తన ప్రవర్తనకు సంబంధించి తనను విచారణకు గురి చేసిన వారిని శిక్షిస్తానని ట్రంప్ ఇటీవల ప్రకటించారు తనకు అనుకూలంగా ఉన్న క్యాబినెట్ సభ్యులనే నియమించి రాజకీయ ప్రత్యర్థులను కఠినంగా శిక్షించడానికి సిద్ధమవుతున్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చిన వేళ ట్రంప్ కు చెక్ పెట్టడానికి బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement