కెనడాలో వ్యాపించిన కార్చిచ్చు అమెరికాలోని నగరాలకూ కష్టాలను తీసుకొచ్చింది. కెనడా నుంచి దట్టమైన పొగ అమెరికా నగరాలకు చేరుకొంది. దీంతో అక్కడ గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. గ్రేట్ లేక్, మధ్య, తూర్పు అమెరికాల్లో ఈ పొగ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతవరణ రక్షణ సంస్థ ఎయిర్‌నౌ.కామ్ ప్రకారం ఇల్లినాయిస్, లోయర్ మిషిగాన్, దక్షిణ విస్కన్సన్‌లో గాలి నాణ్యత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యా#హ్నం షికాగో, డెట్రాయిట్, మిల్వాకీలో గాలి నాణ్యత అత్యల్ప స్థాయికి చేరిందని పేర్కొన్నారు. మిన్నెసోటలో 23వ సారి మంగళవారం గాలినాణ్యత హెచ్చరికలను జారీ చేశారు.
బుధవారం రాత్రి వరకూ వాతావరణం ఇలానే ఉంటుందని పేర్కొన్నారు. ఇక మిన్నియాపోలీస్, సెయింట్ పౌల్‌లో కూడా గగనతల మార్గాలు మొత్తం ఇలానే ఉంటాయని మిషిగాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని షికాగో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చాలా వరకు డేకేర్ సెంటర్లు, క్రీడా ప్రాంగణాలు మూసివేశారు. సాధారణంగా అత్యవసర సేవలు అందించే ‘్లఫట్ ఫర్ లైఫ్’ సంస్థ విస్కన్సన్‌లో ఓ ప్రమాదం కాల్‌కు స్పందించలేదు.
వైమానిక విభాగం నిబంధనల ప్రకారం కనీసం 3.2 కిలోమీటర్ల మేరకు మార్గం కనిపిస్తేనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 2.4 కిలోమీటర్ల మార్గం మాత్రమే కనిపిస్తోంది. కెనడాలో ప్రభుత్వ నివేదికల ప్రకారం సోమవారం నాటికి 76,129 చదరపు కిలోమీటర్లలో అడవులు, ఇతర ప్రదేశాలు కాలిపోయాయి. ఈ అడవుల్లో కార్చిచ్చు జూన్ 1వ తేదీన మొదలైంది. 1989లో వచ్చిన కార్చిచ్చు కారణంగా రికార్డు స్థాయిలో 75,596 కిలోమీటర్ల మేరకు అడవి అగ్నికి ఆహుతైంది. ఈ సారి కార్చిచ్చు దానిని మించిపోయింది.