Saturday, November 23, 2024

భారత్ కు వాక్సిన్ లు ఇచ్చేందకు సిద్దం: అమెరికా..

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. మన దేశంలో కూడా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే భారత్ కు వ్యాక్సిన్ ను అందించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాక తెలిపింది. టీకా విరాళాల స్వీక‌రించే విష‌యంలో భార‌త్ చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాల‌ను ప‌ర‌శీలీస్తోంద‌ని, ఇండియా అంగీక‌రిస్తే వెంట‌నే ఇండియాల‌కు టీకాలు విరాళంగా పంపుతామ‌ని అమెరికా ప్ర‌క‌టించింది.  ఇక భార‌త్ లో ఫార్మారంగం బ‌లంగా ఉంద‌ని, వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని మ‌రింత వేగ‌వంతం చేసేందుకు ఆర్ధిక స‌హాకారం అందించేందుకు క్వాడ్ స‌భ్య‌దేశాలు సిద్ధంగా ఉన్నాయ‌ని అన్నారు.  

ఇక యూఎస్‌లో ఇప్ప‌టికే మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి.  ఆ దేశంలో వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అమెరికా గట్టిగా చెబుతున్న‌ది.  ఒకవైపు వ్యాక్సిన్లు వేస్తూనే పెద్ద‌మొత్తంలో మిగులు వ్యాక్సిన్ల‌ను నిల్వ చేసింది అమెరికా.  దాదాపుగా 80 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్ల‌ను వివిధ దేశాల‌కు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధ‌మైన అమెరికా ఇప్ప‌టికే 40 మిలియ‌న్ వ్యాక్సిన్ డోసుల‌ను నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, పాక్ తోపాటు వివిధ దేశాల‌కు అందించింది.

ఇది కూడా చదవండి: సౌరవ్ గంగూలీ బయోపిక్..హీరో ఎవరో తెలుసా..?

Advertisement

తాజా వార్తలు

Advertisement