Friday, November 22, 2024

అమెరికా అమ్ములపొదిలోకి బీ-21 రైడర్‌ యుద్ధవిమానం

ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధవిమానం బీ-21ను అమెరికా ఆవిష్కరించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున కాలిఫోర్నియాలోని పామ్‌డేల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ రైడర్‌ యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్లీnట్‌లో చేరింది. ఇప్పటివరకు ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌ యుద్దవిమానాలను అత్యంత అధునాతనమైనవిగా చెప్తారు. అయితే, వీటికన్నా ఈ బీ-21 రైడర్‌ రెండు జనరేషన్ల ముందున్నది. రాఫెల్‌ 4.5 జనరేషన్‌ కాగా.. బీ-21 రైడర్‌ 6వ తరం యుద్ధవిమానం. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ విమానాన్ని గుర్తించి ఢీకొనే రాడార్‌ ఇంతవరకు తయారవ‌లేదు. అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేర్చిన వెంటనే దీని స్పెసిఫికేషన్‌ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

డెలాయిట్‌ రైడర్స్‌ను గుర్తు చేసుకునే విధంగా ఈ యుద్ధవిమానానికి బీ-21 అని పేరు పెట్టారు. అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ ప్లీnట్‌లో బీ-21 రైడర్‌ చేరడంతో ఈ రకం యుద్ధ విమానం కలిగిన తొలి దేశంగా అమెరికా చరిత్ర సృష్టించింది. చైనా, జపాన్‌, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు కూడా ఈ రకం టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై పనిచేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా వైమానిక దళం ‘నార్త్రోప్‌ గ్రుమ్మన్‌’ కంపెనీ నుంచి బీ-21 రైడర్‌ విమానాలు ఆరింటిని కొనుగోలు చేసింది. మరో 100 విమానాలను అమెరికా కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఇలాంటి విమానాలను అమెరికా కనీసం 200 కొనుగోలు చేయాలని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వద్ద కేవలం 10 శాతం యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా రాడార్‌ను డాడ్జింగ్‌ చేయడం ద్వారా ఎక్కడైనా దాడి చేయగలవు.

- Advertisement -

అయితే ఏదైనా దేశం రాడార్‌ను అప్‌డేట్‌ చేసినపక్షంలో వీటిలో 10 శాతం విమానాలు కూడా పనికిరావు. ఇలాంటి పరిస్థితిలో అమెరికాకు అలాంటి విమానం అవసరం. ఇది ఎలాంటి క్లూ లభించకుండా చేసి ఏ దేశంలోనికైనా ప్రవేశించి దాడి చేయగల సామర్ధ్యం కలిగి ఉన్నది. అందుకే అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ బీ-21 రైడర్‌ను తన అమ్ముల పొదిలో చేర్చుకున్నది. దీని పరిధి 9,600 కి.మీ కాగా, దాదాపు 10టన్నుల పేలోడ్‌ను తీసుకెళ్లే సామర్ధ్యం కలిగివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement