Wednesday, November 20, 2024

Snow storm | మంచు తుపాను నుంచి కోలుకోని అమెరికా.. క్రిస్మస్‌ వేడుకలకు వేలాది మంది దూరం

అమెరికాలో తీవ్రమైన మంచుతుపాను నుంచి ఇంకా కోలేదు.. తాజా మంతు తుపాను కారణంగా 32 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జనజీవనం అతలాకుతలం అవుతోంది. ప్రభుత్వం చేపట్టే అత్యవసర సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. మిలియన్ల కొద్ది అమెరికన్లు శీతాకాలపు మంచు తుపాను కారణంగా క్రిస్మస్‌ వేడుకలు జరుపుకోలేక పోయారు. విద్యుత్‌ అంతరాయం, చలికారణంగా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. క్రిస్మస్‌ వేడుకలను జరుపుకునేందుకు వారాంతంలో వేసుకున్న ప్రణాళికలు అన్ని ఇళ్లకే పరిమతయ్యాయి. అమెరికాలోని తూర్పు ప్రాంతం సోమవారం వరకు తీవ్ర స్తంభనలోనే ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం వరకు పరిస్థితులు అదుపులోకి వచ్చే పరిస్థితులు లేవని పేర్కొన్నారు.

బఫెలో, పశ్చిమ న్యూయార్కలో మంచు తుఫాన్‌ నగరాన్ని అతలాకుతలం చేసింది. అత్యవసర సేవలు అందించేందుకు సిబ్బంది కనీసం బాధితుల వద్దకు కూడా చేరుకోలేక పోయారు. ఇది ఒక రకంగా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నట్లు న్యూయార్క్‌ గవర్నర్‌ కాథీ హోచుల్‌ తెలిపారు. బఫెలో నగరంలో 8 అడుగుల మేరకు మంచు ప్రవహిస్తోందని.. దీని కారణంగా విద్యుత్‌ అంతరాయం ఏర్పడి.. స్థానికులు ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావొద్దని సూచించారు. అమెరికాలోని తూర్పురాష్ట్రాల్లో 2 లక్షల మంది ప్రజలు క్రిస్మస్‌ వేడుకలను ఉదయం విద్యుత్‌ లేకుండానే చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. తుఫాన్‌తోపాటు భయంకరమైన గాలులతో .. గత ఐదు రోజుల కంటే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్లు సంకేతాలు తావరణంలో వస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో రవాణా వ్యవస్థలో వేలసంఖ్యలో విమానసర్వీసులు రద్దు చేయబడ్డాయి.

మంచుతో కప్పబడిన ఇళ్లలో నివాసితులతోపాటు సెలవులకు వచ్చిన యాత్రికులు సైతం చిక్కుకుపోయారు. తొమ్మది రాష్ట్రాల్లో మంచు తుఫాన్‌ కారణంగా 32 మంది వరకు చనిపోయినట్లు .. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంటల తరబడి మంచు కురుస్తుండటంతో మంచు గడ్డల కింద కొంత మంది చిక్కుకుపోయి ప్రాణాలు వదిలినట్లు.. వారికోసం డిజాస్టర్‌ సిబ్బంది కనిపెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఈ మంచు తుఫాను 1977 నాటి భయంకరమైన మంచుతుఫానును సైతం దాటి తీవ్రంగా ఉన్నట్లు.. భయంకరమైన గాలులతోపాటు మంచు తుఫాను కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంచు కారణంగా స్తంభించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పునరుద్ధరణ మంగళవారం వీలుకాదని ప్రభుత్వం తెలిపింది. 18 అడుగుల మేర మంచు కప్పివేయడంతో విద్యుత్‌ పునరుద్ధరించేందుకు వీలుకావడం లేదని ఓ అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement