ఆమెరికాలో వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్న అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు రిపబ్లికన్ నేత మైక్ పెన్స్ తెలిపారు. అనేక చర్చల తర్వాత అధ్యక్ష బరి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని, తన ప్రచార కార్యక్రమాలను మాత్రమే వీడుతున్నట్లు ప్రకటించారు.
సంప్రదాయ విలువలకు కట్టుబడి రిపబ్లికన్ నేతలకు మద్దతుగా ఉంటానని, వారి విజయాల కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆర్థిక సవాళ్లు, పార్టీ పోలింగ్లో వెనుకబడటంతో పెన్స్ అధ్యక్ష బరి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ర్యాన్ బింక్లీ, టిమ్ స్కాట్ తదితరులు పోటీపడుతున్నారు.