Saturday, November 23, 2024

America కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి ట్రాన్స్ జెండ‌ర్

న్యూయార్క్ – డెలవేర్‌లోని ఎట్‌ లార్జ్‌ హౌస్‌ డిస్ట్రిక్ట్‌ నుండి డెమోక్రటిక్ అభ్యర్థి, ట్రాన్స్ జెండర్ సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు. ఈ విజయంతో ఆమె కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను గెలిచింది కాంగ్రెస్‌లో చరిత్ర సృష్టించడం కోసం కాదని, కేవలం డెలావేర్‌లో మార్పును సృష్టించేందుకేనని వివరించారు.

సారా మెక్‌బ్రైడ్ జాతీయ ఎల్‌జీబీటీక్యూ కార్యకర్తగా చ్చేస్తున్నారు. దాంతో ఆవిడ ఎన్నికల సమయంలో ఏకంగా 30 లక్షల డాలర్స్ కు పైగా ప్రచార విరాళాలు సేకరించింది. 2016లో, డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ఒక ప్రధాన పార్టీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి లింగమార్పిడి వ్యక్తిగా ఆమె పేరు గాంచింది. డెలావేర్ నుండి ఆవిడ 2020లో మొదటి ట్రాన్స్‌స్టేట్ సెనేటర్ అయ్యారు. 2010 నుండి, డెలావేర్ ఓటర్లు డెమొక్రాట్‌లకు మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో సారా మెక్‌బ్రైడ్ ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement