Friday, November 22, 2024

అమెరికా కీల‌క నిర్ణ‌యం-ఎక్స్ జెండ‌ర్ పాస్ పోర్ట్

అమెరికా ఓ కొత్త త‌ర‌హా పాస్ పోర్ట్ ని జారీ చేసింది. అదే ఎక్స్ జెండ‌ర్ హోదా క‌లిగిన పాస్ పోర్ట్. అయితే ఈ పాస్ పోర్ట్ ఎవ‌రికి జారీ చేశార‌నే విష‌యాన్ని చెప్ప‌లేదు. అస‌లు ఈ పాస్ పోర్ట్ జారీ వెనుక క‌థ ఏంటో తెలుసుకుందాం. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడ‌..మ‌గ రెండు జెండ‌ర్స్ కి మాత్ర‌మే పాస్ పోర్ట్ ల‌ను జారీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆడ.. మగ కాని వారిని గుర్తించే ప్రక్రియ మొదలైంది. వారిని ఎల్ జీబీటీ అంటే .. లెస్బియన్.. గే.. బైసెక్సువల్.. ట్రాన్స్ జెండర్లు గా గుర్తించటం షురూ అయ్యింది.ఎలా అయితే మగ.. ఆడను వేర్వేరు గా గుర్తిస్తారో.. అలానే తమ ను కూడా గుర్తించి.. తమ కు వేరే పాస్ పోర్టు జారీ చేయాలన్న డిమాండ్ గడిచిన కొద్దికాలం గా వినిపిస్తోంది.

అయితే.. దీని పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇలాంటి వారిని గుర్తించే పని లో భాగం గా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరి కా ప్రభుత్వం తాజాగా ‘‘ఎక్స్’’ జెండర్ హోదా కలిగిన ఒక కొత్త తరహా పాస్ పోర్టు ను జారీ చేసింది. ఇదో పెద్ద విజయం గా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇదో పండుగ లాంటి వార్త అని.. ఎల్ జీబీటీ హక్కుల కార్యకర్త జెస్సికా స్టెర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. . ఈ తరహా పాస్ పోర్టు కోసం కొలరాడోకు చెందిన డానా జిమ్ అనే వ్యక్తి 2015 నుంచి పోరాడుతున్నాడు.

అబ్బాయి గా పుట్టిన డానా జిమ్ కొంత కాలం అమెరికా సైన్యం లో కూడా పని చేశాడు. అనంతరం లింగ మార్పిడి చేసుకొని అమ్మాయి గా మారిపోయాడు. అప్పటి నుంచి తన లాంటి వారి హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఈ క్రమంలో అమెరికా జారీ చేసిన తొలి ఎక్స్ పాస్ పోర్టు డానా జిమ్ కే ఇచ్చి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారికంగా మాత్రం ఎవరూ దీన్ని ఖరారు చేయటం లేదు. మొత్తానికి ఇది చారిత్రాత్మ‌క నిర్ణ‌య‌మ‌నే చెప్పాలి. మ‌రి ఈ పాస్ పోర్ట్ ని ఎవ‌రెవ‌రికి ఇస్తారానే విష‌యం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement