Tuesday, November 5, 2024

Americaలో తొలి ఓటు ప‌డింది.. కౌంటింగ్ లో కమలా హ్యారిస్, ట్రంప్ కు మూడేసి ఓట్లు

అమెరికాలో తొలి ఓటు ప‌డింది..
ఆ ఊరిలో ఆరు ఓట్లే
వంద శాతం పోలింగ్
ఆ వెంట‌నే కౌంటింగ్
కమలా హ్యారిస్, ట్రంప్ కు మూడేసి ఓట్లు

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్రారంభ‌మైంది.. న్యూ హ్యాంప్‌షైర్ స్టేట్‌లోని డిక్స్‌విల్లే నాచ్ లో తొలి ఓటింగ్ జ‌రిగింది. ఇక్క‌డ కేవ‌లం ఆరు మందే ఓట‌ర్లున్నారు.. అంద‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.. ఆ వెంట‌నే కౌంటింగ్ కూడా ప్రారంభించారు.. ఓట్ల లెక్కింపులో కమలా హ్యారిస్, , ట్రంప్ కు మూడేసి ఓట్లు వ‌చ్చాయి. కాగా, అమెరికా-కెనడా సరిహద్దులకు ఆనుకుని ఉన్నడిక్స్‌విల్లే నాచ్ కు పర్యాటకులు ఎక్కువగా వచ్చిపోతుంటారిక్కడికి. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య ఉండే విలేజ్. 1960 నాటి అధ్యక్ష ఎన్నికల నుంచీ ఇక్కడ తొలి ఓటు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ అమెరికన్ విలేజ్‌లో ఉండేది ఆరు మందే- తొలి ఓటు పడేదీ అక్కడే- ఎవరు గెలిస్తే వాళ్లకే అధ్యక్ష పీఠం..!అయితే ఇప్పుడు కౌంటింగ్ లో ఇద్ద‌రికీ స‌మాన ఓట్లు రావ‌డం విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement