Monday, January 20, 2025

America పెద్ద‌న్న ప్ర‌మాణ స్వీకారం నేడే… తొలి రోజునే రెండు వంద‌ల ఫైళ్ల‌పై ట్రంప్ సంత‌కాలు ..

వాషింగ్ట‌న్ డిసి – అమెరికా – తాను అధ్యక్షుణ్ని అవ్వగానే.. తనకి ఉన్న అపరిమిత అధికారాలను ఉపయోగించి.. పరిపాలనా ఆదేశాలను జారీ చేస్తాను అని నేడు అధ్యక్షుడిగా బాద్య‌త‌లు స్వీక‌రించ‌నున్న డొనాల్డ్ ట్రంప్ తన తాజా ప్రసంగంలో తెలిపారు. ప్రమాణ స్వీకారం కోసం గ‌త రాత్రి వైట్‌హౌస్‌కి తిరిగి వచ్చిన సందర్భంగా జ‌రిగిన “విక్టరీ ర్యాలీకి హాజ‌రైన వేలాది మంది అభిమానుల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తన మొదటి రోజునే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లో “చారిత్రక వేగం, బలం”తో కదులుతానని మద్దతుదారులకు తెలిపారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేస్తానన్న ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడమే కాకుండా.. పశ్చిమాసియాలో కూడా శాంతిని తెస్తానన్నారు.

ట్రంప్ రాబోయే నాలుగు సంవత్సరాలు ఎలా ఉంటుందో చెప్పారు. నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయాన్ని వేడుకలా జరుపుకున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చిన ట్రంప్.. తన పాలనా అంశాల్లో అమెరికాకే తొలి ప్రాధాన్యం ఉంటుంది అన్నారు. టీవీలో తన ప్రమాణ స్వీకారం చూడమని కోరారు. అది చాలా సరదాగా ఉంటుంది అన్నారు.

- Advertisement -

ఇది ఇలా ఉంటే …

అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్సీకరించిన వెంట‌నే ట్రంప్ 200 కంటే ఎక్కువ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేయబోతున్నారు. ఇందులో చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లు, ప్రకటనల వంటి ఇతర అధ్యక్ష ఆదేశాలు కూడా ఉంటాయి. జో బిడెన్ పాలనలో ఇచ్చిన మూర్ఖపు కార్యనిర్వాహక ఉత్తర్వులను తాను ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే రద్దు చేస్తానని ట్రంప్ తెలిపారు. ..


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌లను పెంచడం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోగే) ఏర్పాటు చేయడం, 1963లో జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించిన రికార్డులను అందుబాటులో ఉంచడం, ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్‌ను రూపొందించడానికి సైన్యాన్ని నిర్దేశించడం వంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.

లింగమార్పిడి చేయించుకున్న మహిళలను.. మహిళా క్రీడా విభాగాల్లో పోటీ చేయకుండా చేస్తాననీ, విద్యపై నియంత్రణను అమెరికా రాష్ట్రాలకు అప్పగిస్తానని కూడా ట్రంప్ తన మద్దతుదారులకు తెలిపారు. “మిమ్మల్ని చాలా సంతోషపెట్టే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లను మీరు చూస్తారు” అన్నారు.

వారిని అరెస్టు చేస్తారా?
అమెరికాలో లక్షల మంది సరైన పత్రాలు లేకుండా ఉన్నారు. వారంతా.. అక్రమ మార్గాల్లో అమెరికాకు వచ్చారు. అలాంటి వలస దారులపై ట్రంప్ చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే.. ఇదివరకు ట్రంప్ ఇచ్చిన పిలుపుతో.. అమెరికా క్యాపిటల్‌పై దాడి చేసి, దోషులుగా తేలిన వారిని ట్రంప్ క్షమిస్తూ.. విడుదల చేయిస్తారని తెలుస్తోంది.

నేడే ప్రమాణం స్వీకారం ..

భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10.30కి అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. కేపిటల్ హిల్ లోని రొటుండాలో ఈ కార్యక్రమం జరగబోతోంది. మంచుతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. ఇండోర్‌లో ఇది జరగనుంది. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో దేశ విదేశీ ప్రతినిధులు, అతిథులు పాల్గొనబోతున్నారు. భారత్ నుంచి అధికారికంగా విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొనబోతుండగా.. అంబానీ దంపతులకు ప్రత్యేక ఆహ్వానం ల‌భించింది.

ప్రమాణ స్వీకారం సమయంలో ప్రత్యేక సంగీత ప్రదర్శనలు, పరేడ్లూ జరగబోతున్నాయి. సుదీర్ఘ వేడుకలు నిర్వహించబోతున్నారు. ప్రమాణం తర్వాత.. వెంటనే ట్రంప్ మార్క్ పాలన మొదలవ్వబోతోంది. దాదాపు 100 రకాల అంశాలపై ట్రంప్ ఆదేశాలు జారీ చెయ్యబోతున్నట్లు తెలిసింది. ఆ తర్వాత సాయంత్రం జరిగే సరదా కార్యక్రమాల్లో ట్రంప్ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement