Wednesday, December 4, 2024

America – కుమారుడికి బైడ‌న్ క్ష‌మాభిక్ష‌ … ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ట్రంప్

ఆదాయ‌ప‌న్ను, అక్ర‌మ తుపాకీ కేసులో దోషిగా బైడ‌న్ కుమారుడు
విచ‌క్ష‌ణాధికారం ఉప‌యోగించి కొడుకుకు విముక్తి
ఇది అధికార దుర్వినియోగం అంటూ ట్రంప్ ఫైర్
క్యాపిటల్ హిల్ దాడి దోషుల‌కు క్ష‌మాభిక్ష ఎందుకివ్వ‌లేదంటూ ప్ర‌శ్న

వాషింగ్ట‌న్ – తుపాకీ అక్రమంగా కొన్నారని, ఆదాయపన్ను చెల్లింపు విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని అమెరికా అధ్య‌క్షుడు బైడ‌న్ కుమారుడు హంటర్ పై పోలీసులు గతంలో కేసులు నమోదు చేశారు. విచారణ తర్వాత కోర్టు హంటర్ ను దోషిగా తేల్చింది. అయితే, శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. ఈ కేసులకు సంబంధించి తాను కల్పించుకోబోనని గతంలో పేర్కొన్నప్రెసిడెంట్ బైడెన్ తాజాగా హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో హంటర్ కు శిక్ష పడే అవకాశం లేదు. కాగా, అధ్యక్ష హోదాలో కొడుకుకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ప్రెసిడెంట్ జో బైడెన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష పెట్టారని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బైడెన్ నిర్ణయం పూర్తిగా న్యాయ విరుద్ధమని ఆరోపించారు. క్రిమినల్ కేసుల నుంచి కొడుకును తప్పించేందుకు అమెరికా రాజ్యాంగం కల్పించిన అధికారాలను బైడెన్ దుర్వినియోగపరిచారని మండిపడ్డారు. హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే క్యాపిటల్ హిల్ దాడి కేసులో బందీలను విడుదల చేయలేదేమని నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement