కరోనా సమయంలో రద్దయిన విమానాలకు సంబంధించిన టికెట్ రీఫండ్ల విషయంలో మన దేశానికి చెందిన ఎయిర్ ఇండియాపై అమెరికా అసహనం వ్యక్తం చేసింది. 121.5 మిలియన్ డాలర్లు (988 కోట్లు) రీఫండ్లతో పాటు, చెల్లింపు ఆలస్యానికి 1.4 బిలియన్ డాలర్లు (11కోట్లు) జరిమానా కట్టాలంటూ ఎయిర్ ఇండియాను ఆదేశించింది. అమెరికా రవాణా విభాగం రీఫండ్ పాలసీ, మన ఎయిర్ ఇండియా విధానలకు భిన్నంగా ఉంది. ఎయిర్లైన్లు తమ విమానాలను రద్దు చేయడం, లేదా సమయాల్లో మార్పులు చేసినప్పుడు ప్రయాణీకుల టికెట్లను చట్టబద్దంగా రీఫండ్ చేయాల్సి ఉంటుంది.
ఓచర్ల రూపంలో ఇవ్వడానికి వీలుండదు. కరోనా సమయంలో అమెరికా వెళ్లి, వచ్చే పలు విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. దీంతో ఆయా విమాన టికెట్ల రీపండ్ విషయంపై ప్రయాణీకులు అమెఇరకా రవాణా విభాగానికి ఫిర్యాదులు చేశారు. వీటి ఆధారంగా ఫిర్యాదులను పరిష్కరించి రీఫండ్లను ఇవ్వాలని అమెఇరకా అధికారులు కోరారు. ఈ ఆదేశాలు ఇచ్చే సమయానికి ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేసింది.
రీఫండ్ల విషయంలో ఎయిర్ ఇండియా అలసత్వం వహించిందని అమెరికా అధికారలు ఆరోపించారు. రీఫండ్ ఫిర్యాదుల్లో సగం వాటిని పరిష్కరించేందుకు ఎయిర్ ఇండియా వంద రోజులు తీసుకుందని పేర్కొంది. ఈ ప్రక్రియకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ఎయిర్ ఇండియా ఆప్డేట్ చేయలని అమెరికా విమర్శించారు. దీని ఫలితంగానే అమెరికా రవాణా విభాగం ఎయిర్ ఇండియాపై జరిమానా విధించింది. ప్రయాణీకులకు చెల్లించాల్సిన 121.5 మిలియన్ డాలర్లతో పాటు, 1.4 మిలియన్ డాలర్ల జరిమానా కట్టాలని ఎయిర్ ఇండియా అమెరికా అధికారులు ఆదేశించారు.
ఎయిర్ ఇండియాతో పాటు మరో ఐదు విమానయాన సంస్థలకు కూడా అమెరికా రవాణా విభాగం అధికారులు జరిమానా విధించారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ ఫ్రంటియర్ 222 మిలియన్ డాలర్ల రీఫండ్లతో పాటు 2.2 మిలియన్ డాలర్ల ఫైన్ కూడా చెల్లించాలని ఆదేశించింది. వీటితో పాటు టీఏపీ పోర్చుగల్, ఏరో మెక్సికో, ఈఐ ఏఐ, అవియానికా సంస్థలకు కూడా జరిమానా విధించింది.