Saturday, January 4, 2025

America – కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల‌లో గ‌న్ ఫైర్ – 12 మంది దుర్మ‌ర‌ణం

నూతన సంవత్సరం వేళ అమెరికాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వాహ‌నంతో జ‌నాల‌పైకి దూసుకొచ్చిన డ్రైవ‌ర్ జ‌రిపిన కాల్పుల‌లో 12 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘ‌ట‌న లూసియానాలోని న్యూ ఆర్లీన్స్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

నూతన సంవత్సర వేడుకల‌లో భాగంగా న్యూ ఆర్లీన్స్లో ఉన్న కెనాల్ అండ్ బోర్బన్ స్ట్రీట్ కూడలిలో భారీ సంఖ్యలో జనాలు గుమికూడారు. అదే సమయంలో వేగంగా ఓ వాహనం అక్కడున్న వారిపైకి దూసుకొచ్చింది. అందులో నుంచి బయటకు వచ్చిన డ్రైవర్ అక్క‌డి సమూహంపై కాల్పులు జరిపాడు. అప్పటికే పలువురు మృతి చెందగా దాదాపు 30 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు డ్రైవర్పై కాల్పులు జరిపినట్లు సమాచారం. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement