Monday, November 18, 2024

TG | విద్యార్థులకు అన్యాయం… జీవో 33లో సవరణలు తేవాలి : హరీశ్ రావు

కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలతో పాలన అడ్డదిడ్డంగా మారిందని… ఏ అంశంపైన కూడా కనీస అవగాహన లేని ప్రభుత్వం.. అడ్డదిడ్డంగా పాలన సాగిస్తోందన్నారు. మెడికల్ సీట్ల అడ్మిషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు సరిగా లేవని విమర్శించారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 33తో తెలంగాణ విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

చివరి నాలుగేళ్లు తెలంగాణలో చదివితే లోకల్ గానే పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. పొరపాటున తెలంగాణ‌ పిల్లలు బయటకు వెళ్లి రెండేళ్లు చదివితే వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. తమిళనాడులో మాదిరి రూల్స్ ఫ్రేమ్స్ చేయండి. అక్కడ ఎంబీబీఎస్ సీటు రావాలంటే ఆరు నుంచి పదివరకు స్థానికంగా చదువుకుని, తల్లిదండ్రులు స్థిర నివాసం కలిగి ఉండాలి. కర్నాటక, కేరళలకు వాటి నిబంధనలు ఉన్నాయి. తెలంగాణకు కూడా సొంత రూల్స్ కావాలి. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి విధానం రూపొందిస్తే అన్ని విద్యాసంస్థలకు మార్గదర్శకత్వం అవుతుంద‌ని హ‌రీశ్‌రావు సూచించారు.

తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలని కొత్త కళాశాలలో స్థానికేతరులకు అవకాశం ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వ నిర్ణయంతో బి కేటగిరి సీట్లు కూడా తెలంగాణ విద్యార్థులకే దక్కాయన్నారు. తెలంగాణ రాష్ట్రం స్థానికతను నిర్ధారించుకునేందుకు ఈ విడత అవకాశం వచ్చిందన్నారు హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి కసరత్తు చేయకుండా పాత విధానాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులు యధావిధిగా పెట్టాలి లేదంటే ఇతర రాష్ట్రాల మాదిరిగా నిబంధనలు సవరించాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు హరీశ్ రావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement