Thursday, November 21, 2024

భారత్‌లో 400 మిలియన్ల‌ భారీ పెట్టుబడి.. ప్రకటించిన ఏఎండీ

భారత్‌లో వచ్చే ఐదు సంవత్సరాల్లో 3,200 కోట్లు (400 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌ ( ఏఎండీ) ప్రకటించింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో జరుగుతున్న సెమీకాన్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. బెంగళూర్‌లో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 2028 నాటికి మూడు వేల మంది ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మార్క్‌ పేపర్‌మాస్టర్‌ తెలిపారు.

2001లో అతి తక్కువ మంది ఉద్యోగులతో తమ కార్యకలాపాలను ప్రారంభించామని, ప్రస్తుతం 6,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు.బెంగళూర్‌లో ఏర్పాటు చేస్తున్న క్యాంపస్‌ను 2023 చివరినాటికి ప్రారంభిస్తామని తెలిపింది. ఇందులో భారీ ల్యాబ్‌తో పాటు, టీమ్‌వర్క్‌ను వేగవంతం చేసేందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంటాయని ఏఎండీ తెలిపింది. ఐదు లక్షల చదరపు అడుగుల వైశ్యాల్యంలో నిర్మిస్తున్న బెంగళూర్‌ క్యాంపస్‌ అందుబాటులోకి వస్తే, ఏఎండీకి దేశంలో ఢిల్లిd, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, ముంబైల్లో 10 చోట్ల ఏఎండీ క్యాంపస్‌లు ఉన్నట్లు అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement