Tuesday, September 17, 2024

BRAOU | అంబేద్కర్‌ వర్సిటీలో ప్రవేశ గడువు పోడిగింపు….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీ.జీ కోర్సుల్లో చేరడానికి చివరి తేది సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

విశ్వవిద్యాలయంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్‌ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా సెప్టెంబర్‌ 30వ తేదీ లోపు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు.

పూర్తి సమాచారం కోసం ఆన్‌లైన్‌లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్‌ డెస్క్‌ నెంబర్లు: 7382929570/80, 040-23680222/333/444/555, టోల్‌ఫ్రీ నెం. 18005990101లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లో సంప్రదించాలని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement