Tuesday, November 26, 2024

ఏఎంబీ సినిమాస్ లో హంట్ .. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్

హంట్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ ని హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సోమ‌వారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభంకానుంది. కాప్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న హంట్‌ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు న‌టించారు. భరత్‌ నివాస్‌, శ్రీకాంత్‌ మేక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు . హంట్‌ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని భవ్యక్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నారు. హంట్ జనవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, మేకింగ్‌ వీడియో సినిమా ఎలా ఉండబోతుందో చెబుతున్నాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్క‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement